రాత్రి 9 తర్వాత సర్జరీలతో సమస్య

17-10-2017: నాడీ సంబంధ శస్త్రచికిత్సలు రాత్రి సమయంలో చేయించుకోవద్దట. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7గంటల మధ్య సర్జరీలు చేస్తే ఎక్కువ సమస్యలు ఉత్పన్నమవుతాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. పగటి వేళలతో పోల్చితే రాత్రి సమయంలో చేసిన శస్త్రచికిత్సల వల్ల దారుణమైన ఫలితాలు వచ్చాయట. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌ శాస్త్రవేత్తలు 2007 నుంచి 2014 మధ్య నాడీ సంబంధ శస్త్రచికిత్సలు చేయించుకున్న 15,807 మందిని పరీక్షించారు. అందులో రాత్రి సమయంలో సర్జరీ చేయించుకున్న 785 మంది రోగాల బారిన పడగా, మరికొందరు మృత్యువాతపడ్డట్లు తేలిందట.