పార్కులో తిరిగితే ఒత్తిడి మాయం

20-03-2019: ఒత్తిడి ఎదుర్కోడానికి రోజూ 20 నిమిషాల పాటు ప్రకృతిలో గడిపితే సరిపోతుందంటున్నారు పరిశోధకులు. ప్రతిరోజూ పార్కులకు వెళ్లే 100 మందిపై యూనివర్సిటీ ఆఫ్ అలబామాకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. వారికి ఉన్న మానసిక సమస్యలు తదితర అంశాలపై అధ్యయనం చేశారు.  ప్రతిరోజూ 20 నిమిషాల పాటు ప్రకృతిలో గడిపే వారికి ఒత్తిడి అసలు ఉండదట. దీనికి తోడు డిప్రెషన్‌, ఇతర మానసిక సమస్యలు కూడా పోతాయని వారు చెబుతున్నారు. అయితే సిటీల్లో జీవించేవారు తమకు సమీపంలో ఉన్న పార్కులకు వెళ్లి కొంత సేపు గడిపితే చాలు.. మానసిక సమస్యల నుంచి బయట పడవచ్చంటున్నారు వారు.