‘కుంగుబాటు’ మందులతో అకాల మరణం

16-09-2017: కుంగుబాటు, ఒత్తిడి, తగ్గడానికి మందులు వేసుకుంటున్నారా? అయితే.. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే వాటితో అకాల మరణం సంభవించే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆ మందులు కొన్ని అవయవాల పనితీరును అడ్డుకుంటాయని, దాంతో అవయవ వ్యవస్థ దెబ్బతిని మర ణం సంభవించే ప్రమాదం ఉందని కెనడాలోని మెక్‌మాస్టర్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. కుంగుబాటుకు లోనైన వారికి సెరోటోనిన్‌ను అడ్డుకునే ఔషధాలను డాక్టర్లు సిఫారసు చేస్తుంటారు. దానితో గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ప్రభావితమై చనిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వివరించారు.