ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆనందం

10-10-2018: ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాలలో వృద్ధులే ఎక్కువగా పాల్గొంటుంటారు. దీని వలన వారు మానసిక ప్రశాంతతను పొందుతారన్న విషయం తెలిసిందే! చిన్నతనం నుంచే పిల్లలను ఈ రకమైన కార్యక్రమాలలో పాల్గొనేలా చేసినట్టయితే, పెద్దయిన తరువాత వారిలో మానసిక ప్రశాంతత ఆనందం రెట్టింపు అవుతుందని అధ్యయనకారులంటున్నారు.. సాధారణంగా పిల్లలను ఇలాంటి కార్యక్రమాలకు తీసుకువెళ్ళరనీ, ఇది అంత మంచిదికాదని వారు చెబుతున్నారు. చిన్నతనం నుంచీ అధ్యాత్మిక భావన వారిలో పెంపొందించగలిగితే వారు మంచి ప్రవర్తనను, అలవాట్లను నేర్చుకుంటారనీ వారు అంటున్నారు. ఆధ్యాత్మిక భావన లేని పిల్లలు పెరిగి పెద్దయిన తరువాత వారు అసాంఘిక కార్యక్రమాల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. చిన్న వయస్సు నుంచే పిల్లలు ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే విధంగా పెద్దలు వారిని ప్రొత్సహించాలని వారు సూచిస్తున్నారు.