స్టెతస్కోపుల్లో రోగకారక బ్యాక్టీరియా

14-12-2018: స్టెతస్కో్‌పలు రోగకారక బ్యాక్టీరియాతో నిండి ఉంటున్నాయని, అంటురోగాలను కూడా వ్యాపింపజేస్తున్నాయని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ అండ్‌ హాస్పిటల్‌ ఎపిడెమియాలజీ జర్నల్‌లో ఈ వివరాలను ప్రచురించారు. స్టెతస్కో్‌పలు, వాటిని శుభ్రపరిచే పద్ధతులను కూడా సమీక్షించారు. పరమాణు శ్రేణిని ఉపయోగించి స్టెతస్కోపులపై ఉన్న బ్యాక్టీరియాను పరిశోధకులు గుర్తించారు.