గుండె వ్యాకోచాన్ని నిరోధించే ప్యాచ్‌!

21-04-2019: గుండెపోటు తర్వాత హృదయ కండరాలు వ్యాకోచానికి లోనవుతాయి. దీని వలన ప్రధాన పంపింగ్‌పై ఒత్తిడి పెరిగి గుండె పనితీరు దెబ్బతింటుంది. అయితే ఈ హృదయ కండరాల వ్యాకోచాన్ని తగ్గించేందుకు అమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీ, చైనాలోని ఫుడాన్‌, సూషౌ యూనివర్సిటీ పరిశోధకులు అంటుకునే ప్యాచ్‌ను అభివృద్ధి చేశారు. నీటి ఆధారిత హైడ్రోజెల్‌ పదార్థంతో ఈ ప్యాచ్‌ను రూపొందించారు. దీన్ని నేరుగా గుండెమీద అతికించి హృదయ కండరాల సాగదీతను తగ్గించడానికి, ఎడమ జఠిరక పునర్నిర్మాణానికి ఉపయోగించవచ్చని వారు వెల్లడించారు.