చిగుళ్ల వ్యాధులతో క్లోమ కేన్సర్‌!

20-01-2018: పంటి చిగుళ్ల వాపు, ఇతరత్రా పంటి సంబంధిత వ్యాధులున్నాయా? అయితే, అతి జాగ్రత్త తీసుకోవాల్సిందే.. ఎందుకంటే, చిగుళ్ల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాతో క్లోమ కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌, ఫిన్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వ్యాధి వల్ల చిగుళ్లలో తిష్ట వేసుకునే ట్రెపోనెమ డెంటికోలా(టీడీ) బ్యాక్టీరియా.. శరీరంలోని ఇతర భాగాలకు చేరి హానికర కణితులు పుట్టే అవకాశం ఉందట. ముఖ్యంగా క్లోమంలోకి చేరి ఆరోగ్యకర కణజాలాన్ని పాడుచేస్తుందట. దీంతో క్లోమ కేన్సర్‌ వచ్చే అవకాశముందట.