గంటలో పాంక్రియాటిక్‌ కేన్సర్‌ గుర్తింపు

19-05-2018: సరికొత్త రక్తపరీక్ష ద్వారా కేవలం గంట వ్యవధిలోనే పాంక్రియాటిక్‌ కేన్సర్‌ను గుర్తించే వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వాస్తవానికి పాంక్రియాటిక్‌ కేన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తించలేం. ముదిరిన తర్వాతే బయటపడుతుంది. చికిత్సకు లొంగదు. కొత్త రక్త పరీక్షా విధానంలో కేవలం ఒక రక్తపు బొట్టుతో గుట్టు పట్టుకోవచ్చునని ఏసీఎస్‌ నానో అనే జర్నల్‌లో వివరించారు. కేన్సర్‌ ప్రాథమిక దశలోనే ఈ పరీక్షలో బయటపడితే మెరుగైన చికిత్స చేయవచ్చునని యూనివర్సిటీ కాలిఫోర్నియా అసిస్టెంట్‌ ప్రాజెక్టు సైంటిస్ట్‌ లీన్‌ లూయిస్‌ తెలిపారు.