ఉత్తుత్తి మాత్రలతో ‘నొప్పులు’ మాయం!

16-09-2018: దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో ఉత్తుత్తి మాత్రలు సమర్థంగా పనిచేస్తాయని అమెరికాలోని నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్న 60 మందిని ఎంపిక చేసిన పరిశోధకులు వారికి ఎలాంటి ప్రభావం చూపని తీపిమాత్రలను ఇచ్చారు. ఇవి శారీరకంగా ఎలాంటి ప్రభావం చూపవని, అయితే మెదడు మాత్రం ఈ మందుకు స్పందిస్తుందని ధైర్యం చెప్పారు. దీంతో దీర్ఘకాలిక నొప్పులకు వాడే సమర్థవంతమైన మందులు వాడిన దానితో సమానంగా రోగుల నొప్పి తగ్గినట్లు గుర్తించామని తెలిపారు.