నూడుల్స్‌ని తింటే అధికబరువు

20-03-2019: క్షణాల్లో తయారయ్యే నూడుల్స్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఇష్టంగా తింటారు. అయితే, వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో పాటు బరువు కూడా పెరుగుతారన్న విషయం ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది.  నూడుల్స్‌ తయారాలో ట్రాన్స్‌ అనే పదార్థాన్ని ఉపయోగిస్తారు. ఈ పదార్థమే అధికబరువుకు కారణమవుతుందంటున్నారు పరిశోధకులు. ఈ నూడుల్స్‌కి అదనంగా ఉప్పు, కారం, కొద్దిగా నూనె, ఇతర మసాలాలు జతచేసి తినడం వలన శరీరంలో కొవ్వుశాతం పెరిగుతుంది. తద్వారా త్వరగా బరువు పెరుగుతారంటున్నారు అధ్యయనకారులు. బరువు తగ్గాలనుకునేవారు నూడుల్స్‌ని ఎంత  దూరంగా ఉంటే అంతమంచిదని వారు సూచిస్తున్నారు.