పక్షవాతం ముప్పును తగ్గించే ఆరంజ్‌ జ్యూస్‌

10-04-2019: పళ్ళరసాలు ఆరోగ్యానికి చాలా మంచిదన్న సంగతి తెలిసిందే! ప్రతిరోజూ లేదా వారంలో నాలుగైదుసార్లు ఆరంజ్‌ జ్యూస్ తాగితే భవిష్యత్తులో పక్షవాతం వచ్చే ముప్పును 25 శాతం తగ్గించుకోవచ్చంటున్నారు నెదర్లాండ్‌ యూనివర్శిటీ పరిశోధకులు, ఈ జ్యూస్‌ తాగడం వలన మెదడులో రక్తం గడ్డే కట్టే అవకాశాలు 20 శాతం తగ్గిపోతాయని కూడా వారు చెబుతున్నారు. ఇరవై నుంచి 70సంవత్సరాల వయస్సు గల 35 వేల మంది మీద సుదర్ఘీకాలం అధ్యయనం చేసిన అనంతరం వీరీ విషయాన్ని చెబుతున్నారు. అధ్యయనకాలంలో కొంతమందికి పళ్ళరసాలు ఇచ్చారు. మరికొంత మందికి కేవలం ఆరంజ్‌ జ్యూస్‌ మాత్రమే ఇచ్చారు. మిగతావారికి ఎలాంటి జ్యూస్‌ ఇవ్వలేదు. ఆరంజ్‌ జ్యూస్‌ తాగిన వారిలో పక్షవాత ముప్పు తగ్గిన విషయాన్ని అధ్యయనకారులు గుర్తించారు.