వాయు కాలుష్యంతో నోటి కేన్సర్‌!

11-10-2018: వాయు కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులతో పాటు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. నోటి కేన్సర్‌ ముప్పు కూడా ఎక్కువేనని తాజా అధ్యయనంలో తేలింది. గాలిలో పీఎం2.5 ధూళికణాలుపెరగడం, పెట్రోల్‌, రసాయన ఉద్గారాలు ఎక్కువ కావడంతో నోటి కేన్సర్‌ బారిన పడేవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగినట్లు తమ పరిశోధనలో తెలిసిందని తైవాన్‌కు చెందిన ఆసియా యూనివర్సిటీ, చంగ్‌ షాన్‌ మెడికల్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. పరిశోధనలో భాగంగా 2012-13కి సంబంధించిన 4,82,659మంది వైద్య రికార్డులను విశ్లేషించగా ఈ విషయం తెలిసిందన్నారు.