కేన్సర్‌ వ్యాప్తిని అడ్డుకునే ‘ఒమెగా3’

15-07-2018: ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపలు, పాలకూర, నట్స్‌, కనోలా నూనె తరచూ తీసుకోవడం వల్ల రక్తపోటు, హృద్రోగాలు రాకుండా అడ్డుకుంటాయి. అయితే, కేన్సర్‌ కణాల వ్యాప్తిని అడ్డుకోవడంలోనూ ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు సహాయపడుతాయని యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎండోకన్నాబినాయిడ్స్‌ కణాలు ఎక్కువగా ఏర్పడతాయని, ఇవి కేన్సర్‌ కణాల వ్యాప్తిని నిరోధిస్తుందని పరిశోధకులు తెలిపారు.