ఎక్కువగా తాగితే వృద్ధాప్యం

18-11-2017: మద్యపానం, ధూమపానం శ్రుతిమించితే శరీరంలో వృద్ధాప్య ఛాయలు తొందరగా ఏర్పడుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖంలో తేడాలు ఏర్పడి ఉన్న వయసుకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులుగా కనబడుతారట. 1976 నుంచి దాదాపు 11,500 మంది స్త్రీ, పురుషులను పరిశీలించగా ఎక్కువగా తాగని వారితో పోల్చితే వీళ్లు ఎక్కువ వయసున్న వారిలా కనబడ్డారని వెల్లడించారు. రోజుకు 20 సిగరెట్లు తాగేవారిలో 41శాతం ఎక్కువ ప్రమాదం ఉందని వివరించారు.