యోగార్ట్‌తో ఒబెసిటీ

20-03-2019: మార్కెట్లో దొరికే డెయిరీ ప్రొడక్ట్స్‌లో ఒకటైన యోగర్ట్‌లో చక్కెర నిల్వలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఊబకాయ సమస్య తప్పదని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. యోగర్ట్ అంటే పెరుగు అనే భావనతో చాలామంది ఈ ప్రొడక్ట్‌ని తీసుకుంటుంటారు. కానీ.. నిల్వఉంచే ప్రాసెస్‌లో ఇందులో కొన్ని పదార్థాలు కలుస్తాయి. దాంతో.. వీటిలో చక్కెర నిల్వలు ఎక్కువగా పెరుగుతాయి. బ్రిటన్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో.. మార్కెట్లో లభించే యోగర్ట్‌లో ఉండే చక్కెర నిల్వశాతం పిల్లల్లో అధికప్రభావం చూపుతాయని తేలింది. దీనివల్ల చిన్నతనంలోనే పిల్లలు ఊబకాయులుగా మారుతున్నారని తేలింది. కేవలం అధికబరువే కాదు.. ఈకారణంగా దంతక్షయం కూడా వస్తుందని పరిశోధకులు అంటున్నారు.