పెయిన్‌కిల్లర్స్‌తో ఊబకాయం ముప్పు

08-12-2017: పెయిన్‌ కిల్లర్స్‌ను తరచుగా వాడుతున్నారా? తస్మాత్‌ జాగ్రత్త. పెయిన్‌ కిల్లర్స్‌ను తరచుగా వాడటం వల్ల ఊబకాయం వచ్చే ముప్పు రెండింతలు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాగే నిద్రలేమి సమస్యలు కూడా ఏర్పడవచ్చని చెబుతున్నారు. దీర్ఘకాలిక నొప్పులకు ఒపియాడ్స్‌, యాంటీడిప్రెస్సంట్స్‌ వినియోగం గత పదేళ్లలో విపరీతంగా పెరిగిపోయిందని యూకేకు చెందిన న్యూక్యాసిల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మెడిసిన్స్‌ కారణంగా తీవ్ర ప్రభావం చూపుతాయని.. అందుకే వీటి వాడకాన్ని తగ్గించాలని హెచ్చరిస్తున్నారు.