ఊబకాయ జన్యువు గుర్తింపు!

21-02-2019: ఊబకాయానికి కారణమయ్యే జన్యువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల హైపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌, గుండెపోటు వ్యాధులను ముందుగానే నియంత్రించవచ్చని చెబుతున్నారు నార్త్‌ కరోలినా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. శరీరం కొవ్వు కణజాలాలను ఏవిధంగా పంపుతోంది, ఏ విధంగా నియంత్రిస్తుందో బహుళ జన్యు వైవిధ్యాల ద్వారా పరిశీలించారు. గతంలో ఊబకాయానికి ‘49 లోకి’ అనే జన్యువు కారణంగా తెలిపారు. అయితే తాజాగా ‘24 కోడింగ్‌ లోకి’ దీనికి కారణంగా చెబుతున్నారు. శరీరంలో కొవ్వు పంపిణీకి తోడ్పాటు అందించే జన్యువులకు చికిత్స చేస్తే ఊబకాయం అదుపులోకి వస్తుందని తేల్చారు.