తల్లుల కారణంగా పిల్లల్లో ఒబెసిటి!

03-10-2018: చిన్న వయస్సులోనే పిల్లల్లో ఒబెసిటికి కారణం తల్లుల పనిగంటలే అంటున్నారు పరిశోధకులు. తల్లులు పని గంటలకూ, పిల్లలో ఒబెసిటీకి కారణమవుతుందన్న విషయం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. వారంలో 35 గంటలకు మించి కార్యాలయాల్లో పనిచేసే తల్లుల పిల్లల్లో ఈ సమస్య ఉన్నట్టు వారు గుర్తించారు. 35 నుంచి 40 గంటల పాటు ఇంటి నుంచి పనిచేసే తల్లుల పిల్లల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉన్న విషయం వీరి దృష్టికి వచ్చింది. పిల్లల్లో ఈ సమస్య మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుంచే ప్రారంభమవుతోందని వారు అంటున్నారు. ఇంటి వద్ద నుంచి పనిచేసే తల్లులు తమ పనికి ఆటంకం కలగకుండా ఉండేందుకు పిల్లలకు రకరకాల ఆహారా పదార్థాలను ఎక్కువ మొత్తంలో ఇవ్వడం లేదా, వారు ఎక్కడికి పోకుండా ఫోన్లు, టీవీలకు వారిని అలవాటు చేయడం వంటివి పిల్లల్లో ఒబెసిటీకి కారణమవుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. బయట కార్యాలయాల్లో పని చేసే తల్లులు తమ పిల్లలను డేకేర్‌లో వేయడం వలన వారు ఇతరులతో కలిసి ఆడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, ఇది వారిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా ఒబెసిటికి దూరం చేస్తుందని వారు స్సష్టం చేస్తున్నారు.