నట్స్‌తో షుగర్‌ రోగులకుగుండెజబ్బులు దూరం!

21-02-2019: షుగర్‌ రోగులు బాదం, వాల్‌నట్‌, పిస్తా వంటి గింజల్ని తరచుగా తింటూ ఉంటే వారిలో గుండెజబ్బు వచ్చే ముప్పు తగ్గుతుందని తాజా సర్వే పేర్కొంది. హార్వర్డ్‌ టీహెచ్‌ చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ సర్వే వివరాలను సర్క్యులేషన్‌ రిసెర్చ్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఇలాంటి గింజల్లో కరగని కొవ్వు ఆమ్లాలు, ఫైటోకెమికల్స్‌, పీచు పదార్థాలు, విటమిన్‌ ఈ, ఫోలేట్‌, పోషకాలు, కాల్షియం, పోటాషియం, మాగ్నేషియం ఉంటాయని, ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయని వివరించారు. ఈ మేరకు టైప్‌2 షుగర్‌తో బాధపడుతున్న 16వేల మందిని ఎంపిక చేసి కొన్నేళ్లుగా వారు ఇలాంటి గింజలు తినడం వల్ల కలిగిన ఉపయోగాలను అధ్యయనం చేశారు.