డెయిరీ కొవ్వుతో హృద్రోగాలు రావు

13-07-2018: పాలు, జున్ను, వెన్నలో ఉండే కొవ్వుతో హృదయ సంబంధ రోగాలు, గుండెపోటు వస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ, ఆ సమస్యలు రావని తాజా అధ్యయనంలో తేలింది. పైగా, కొన్ని రకాల డెయిరీ కొవ్వులు గుండెపోటు నుంచి రక్షణనిస్తాయని వెల్లడైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సస్‌ శాస్త్రవేత్తలు 22 ఏళ్ల పాటు ‘పాల ఉత్పత్తుల్లోని కొవ్వుల వల్ల హృద్రోగాలు వస్తాయా?’ అన్న దానిపై పరిశోధనలు చేయగా అలాంటిదేమీ లేదని తేలింది.