మలేరియాకు కొత్త వ్యాక్సిన్‌!

17-07-2018: మలేరియా కారక క్రిములను సమర్థంగా నిర్మూలించగల కొత్త మందును అమెరికాలోని యేల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఎలుకల్లో మలేరియా పరాన్నజీవిని పూర్తిగా తుదముట్టించడంతో కొత్త వ్యాక్సిన్‌ తయారీకి మార్గం సుగమమైంది. మలేరియా పరాన్నజీవి ముందు ఒక ప్రొటీన్‌ను విడుదల చేస్తుంది. అది మనకు వ్యాధుల నుంచి రక్షణగా నిలిచే టి-సెల్స్‌ జ్ఞాపక శక్తిని హరించేస్తుంది. ఆపై మలేరియా విజృంభిస్తుంది. తాజాగా కనిపెట్టిన మందు ఆ ప్రొటీన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసింది.