ఊపిరితిత్తుల కేన్సర్‌కు కొత్త చికిత్స

16-04-2019: ప్రాణాంతక కేన్సర్‌ వ్యాధిని నయం చేసేందుకు కీమోథెరపీ ద్వారా చికిత్స అందిస్తుంటారు. ఇందుకోసం మందును నోటి ద్వారా లేదా ఇంజెక్షన్ల రూపంలో రోగులకు అందిస్తుంటారు. అయితే, ఊపిరితిత్తుల కేన్సర్‌కు ఇవి సమర్థంగా పనిచేయకపోవచ్చు. అందుకోసమే మందు నేరుగా ఊపిరితిత్తులకు చేరి సమర్థంగా పనిచేసేందుకు వినూత్న కీమోథెరపీ విధానాన్ని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అదే ఇన్‌హేలబుల్‌ కీమోథెరపీ. ఈ విధానం ద్వారా మందును పీల్చుకోవాలి. అప్పుడు మందు నేరుగా ఊపిరితిత్తులకు చేరుతుందని, తద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.