టీబీ చికిత్సకు కొత్త విధానం!

16-03-2019: క్షయపై పోరాడేందుకు సరికొత్త విధానాన్ని అమెరికాలోని నాట్రె డామ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. క్షయ వ్యాధి సోకిన కణాలు విడుదల చేసే ఎక్స్‌ట్రాసెల్లులర్‌ వెసైల్స్‌ (ఈవీ)ను యాంటీబయాటిక్స్‌తో కలిపి అందిస్తే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచవచ్చని, ఇది టీబీపై పోరాడేందుకు దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ తరహా విధానాన్ని ఎప్పుడూ గుర్తించలేదని చెప్పారు. ఈవీలలోని బ్యాక్టీరియల్‌ ఆర్‌ఎన్‌ఏ సెన్సింగ్‌ మార్గాన్ని మెరుగుపర్చడం వలన క్షయ కణాల సంక్రమణను నియంత్రింవచ్చని జెఫ్రీ షోరే అనే పరిశోధకుడు తెలిపారు.