ఆక్టోపస్‌ ప్రేరణతో సరికొత్త ప్యాచ్‌

26-05-2019: ఆక్టోపస్‌ ప్రేరణతో సరికొత్త ప్యాచ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ ప్యాచ్‌ను చర్మంపై అతికిస్తే చాలు.. నాడి, గుండె స్పందన వివరాలను సులువుగా తెలుసుకోవచ్చని దక్షిణకొరియాలోని సంగ్యున్‌క్వాన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలాంటి వాతావరణంలోనైనా ఈ ప్యాచ్‌ పనిచేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పైగా ఖర్చు కూడా తక్కువే. గ్రాఫేన్‌ తరహా సెన్సర్లను పెట్టి.. ఆక్టోప్‌సలా పీల్చే నూలు, పాలియురేతేన్‌, పాలిస్టర్‌, రసాయనాల సాయంతో ప్యాచ్‌ను అభివృద్ధి చేశారు.