బ్రెస్ట్‌ కేన్సర్‌కు కొత్త మందు!

27-09-2019: బ్రెస్ట్‌ కేన్సర్‌ను తగ్గించడానికి అమెరికా శాస్త్రవేత్తలు కొత్త మందు కనిపెట్టారు. దాని పేరు సీడీకే 4/6. ఇది తీవ్రమైన హెచ్‌ఈఆర్‌ 2 కేన్సర్‌ కణాలను కూడా వ్యాపించకుండా, కణితులు పెరగకుండా పట్టి ఉంచుతుంది. అంతే కాకుండా వ్యాధి నిరోధకతను కూడా పెంచుతుంది. బ్రెస్ట్‌ కేన్సర్‌కు కారణమయ్యే ఎంజైమ్‌ను అడ్డుకొంటుంది. ఈ మందు తయారీ కోసం శాస్త్రవేత్తలు కృత్రిమ కణజాలాలపై పరిశోధనలు నిర్వహించారు. కణజాలాలపై కేన్సర్‌ కణాలు దాడి చేసినప్పుడు కణితి ఏర్పడే రీతుల్లో మార్పులను బట్టి మందును కనిపెట్టారు.