14-12-2017: ఎలాంటి దుష్ప్రభావాలూ లేని సరికొత్త ‘లవ్ హార్మోన్’ ఆక్సిటోసిన్ అందుబాటులోకి రానుంది! దీన్ని వాడితే సైడ్ ఎఫెక్ట్స్ అతి తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రసవ సమయంలో ఇబ్బందులను తొలగించడంతో పాటు బాలింతల సంరక్షణ, బంధాల బలోపేతం, సామాజిక సంప్రదింపులు, ఒత్తిడి, ఆత్రుత వంటి అంశాలను ఆక్సిటోసిన్ హార్మోన్ నియంత్రిస్తుంది. దీన్ని ఎక్కువ కాలం లేదా అధిక మోతాదులో వాడితే గుండె జబ్బులు, గర్భాశయం ఛిద్రమవడం వంటి సమస్యలు వస్తాయని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్కు చెందిన మట్టెంట్హేలర్ తెలిపారు. అయితే తమ పరిశోధకుల బృందం ఆక్సిటోసిన్ నిర్మాణంలో స్వల్ప మార్పులు చేసి సరికొత్త అణువును సృష్టించినట్లు చెప్పారు.