కేన్సర్‌ను నిర్ధారించే కొత్త రక్త పరీక్ష

14-12-2017: రెండు రకాల కేన్సర్‌ వ్యాధులను నిర్ధారించే సరికొత్త రక్త పరీక్ష ను జార్జియా స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. లింపోమియా (తెల్లరక్త కణాల కేన్సర్‌), మెలనోమా (ఒక రకమైన చర్మ కేన్సర్‌)ను ఇన్‌ఫ్రారెడ్‌ స్పెకో్ట్రస్కోపితో రక్త పరీక్షలు చేసి నిర్ధారించవచ్చని తెలిపారు. ఆరోగ్యవంతమైన ఎలుకలు, కేన్సర్‌ వ్యాధి ఉన్న ఎలుకల నుంచి రక్త నమూనాలను సేకరించి ఇన్‌ఫ్రారెడ్‌ స్పెకో్ట్రస్కోపితో పరీక్షలు చేయగా.. లింపోమియా, మెలనోమా కేన్సర్లను గుర్తించగలిగినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.