పుట్టగొడుగులు ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్‌

21-10-2017: అల్పాహారంగా పుట్టగొడుగులు తీసుకుంటే ఆకలి తక్కువగా అయ్యి, కడుపు నిండిన భావన కలుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఇప్పటిదాకా పుట్టగొడుగులను మాంసాహారానికి సరైన ప్రత్యామ్నాయంగానే చూశారని, కానీ, ఇవి పుష్కలమైన ప్రొటీన్లు కలిగిన బలవర్ధకమైన ఆహారం అని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసోటా పరిశోధకులు తెలిపారు. మాంసాహారాన్ని, పుట్టగొడుగుల ప్రొటీన్‌ స్థాయులను పరిశీలించగా రెండింటిలోనూ దాదాపు సమాన కేలరీలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. అంతేకాదు, వీటితో ఎక్కువగా తిన్నామన్న అనుభూతి కలిగించి బరువు తగ్గడానికి దోహదం చేస్తాయని, తృప్తిని కలిగిస్తాయని వివరించారు.