నోటి అనారోగ్యంతో కేన్సర్‌!

19-06-2019: నోటిని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోకపోతే కాలేయ కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువని బ్రిటన్‌లోని క్వీన్స్‌ వర్సిటీ బెల్‌ఫాస్ట్‌ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. నోటి అనారోగ్యం వలన హెపాటో సెల్యులర్‌ కార్నికోమా (హెచ్‌సీసీ) పెరిగే ప్రమాదం 75్డు అధికంగా ఉంటుందని, కాలేయ కేన్సర్‌కు అదే ప్రధాన కారణమని వారు పేర్కొన్నారు. పరిశోధనల్లో భాగంగా 4.69 లక్షల మందికిపైగా డేటాను వారు విశ్లేషించారు. కాలేయ, పెద్దపేగు, పురీషనాళ, జీర్ణాశయ కేన్సర్‌లకు నోటి ఆరోగ్యానికి గల సంబంధాన్ని వారు గుర్తించారు.