ఎక్కువ చదివితే ఎక్కువ ఆయుష్షు

05-09-2018: దీర్ఘాయువు కోసం జన్యువుల మీద చేసిన ఒక అధ్యయనం ప్రకారం, పుస్తక పఠనం ఎంత ఎక్కువగా చేస్తే అన్ని సంవత్సరాల ఆయుష్షు పెరుగుతుందట. దీని మీద యాలె యూనివర్సిటీ వారు దీర్ఘకాలం పాటు అధ్యయనం నిర్వహించారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ముప్ఫై నిమిషాల పాటు రకరకాల పుసక్తకాలు చదివినవారి జీవితకాలం 23 నెలలు అంటే సుమారు రెండు సంవత్సరాలు పెరుగుతుందన్న విషయాన్ని వీరు గుర్తించారు. కేవలం పుస్తక పఠనం ద్వారానే జీవితకాలం పెరుగుతుందన్న విషయాన్ని వీరు స్పష్టం చేయలేదు. పుస్తక పఠనం ద్వారా లభించే ఫలితాలే ఎక్కువ కాలం జీవించడానికి కారణం కావచ్చని వీరు అభిప్రాయపడుతున్నారు. పుస్తక పఠనంతో జ్ఞాపకశక్తి పెరిగే అవకాశముందనీ, ఒత్తిడి, ఆందోళన వంటివి చాలావరకూ రావనీ, ఈ కారణాల వలన జీవితకాలం పెరిగే అవకాశాలు ఎక్కువని స్పష్టం చేస్తున్నారు.