అబ్బాయిల్లోనే ఆటిజం అధికం

19-10-2017: అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిల్లోనే ఆటిజం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మొదడులోని సిగ్నలింగ్‌ వ్యవస్థలో ఉండే తేడానే అందుకు కారణమని గుర్తించారు. నలుగురు అబ్బాయిల్లో ఆటిజం ఉంటే ఒక అమ్మాయిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని అమెరికాలోని యూనివర్సిటి ఆఫ్‌ లోవా పరిశోధకుడు టెడ్‌ ఎబుల్‌ తెలిపారు. అబ్బాయిల్లోనే ఆటిజం లోపాలు ఎందుకు సంభవిస్తున్నాయనే విషయం అర్థంకావడం లేదని అన్నారు. నాడి సంబంధ లోపాలు, క్రియాశీలంగా లేకపోవడం, నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొవడం వంటి లక్షణాలు అబ్బాయిల్లోనే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రతి 200 మంది ఆటిజం బాధితులను గమనిస్తే ఒకరిలో ప్రత్యేకమైన క్రోమోజోమ్‌లోని డీఎన్‌ఏలో లోపాలు ఉన్నట్లు తేలింది. ఎలుకలపై పరిశోధన చేసి ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు పరిశోధకులు తెలిపారు.