మైగ్రేన్‌ హుష్‌కాకి!

11-08-2017:

అవిసె గింజలు 5 గ్రాములు, ఆవాలు 5 గ్రాములు ఈ రెంటినీ కలిపి నీళ్లల్లో మెత్తగా నూరి ఆ మిశ్ర మాన్ని తల పైన పట్టువేయాలి ఆ తర్వాత తల పట్టు మీద కాగితం అంటించి కాపడం పెడితే పార్శ్వపు తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

5 గ్రాముల పంచదార, 5 గ్రాముల పటిక బెల్లం పొడిని 250 మి.లీ నీళ్లల్లో కరిగించి మూత పెట్టి ఉంచాలి. ఆ మరునాటి ఉదయాన్నే ఏమీ తినక ముందు.. ఆ ద్రావణం తాగితే పార్శ్వపు నొప్పి తగ్గిపోతుంది.

బచ్చలాకు నూరి నొసట పట్టు వేస్తే, తలనొప్పి, పార్శ్వపు నొప్పి రెండూ తగ్గిపోతాయి.

జీలకర్రను నిమ్మకాయ రసంతో నూరి పట్టువేస్తే చాలా త్వరగా నొప్పి తగ్గిపోతుంది.

పిప్పళ్లు, మిరియాలు, కరక్కాయ - వీటిని సమభాగాలుగా కలిపి, గంజిలో నూరి పట్టువేస్తే పార్శ్వపు నొప్పి చాలా వేగంగా తగ్గుతుంది.

సైంధవ లవణాన్ని నెయ్యితో మెత్తగా నూరి, వడగట్టాలి. ఈ రసాన్ని రోజూ రెండు మూడు చుక్కలు ముక్కులో వేసుకుంటే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.