వీడియో చాటింగ్‌తో వృద్ధుల్లో మానసిక ప్రశాంతత

21-11-2018: వీడియో చాటింగ్‌ వచ్చిన తర్వాత.. తమ పిల్లలు ఎక్కడో దూరంగా ఉద్యోగాలు చేస్తున్న వృద్ధులకు ఉపశమనం కలుగుతోంది. ఇదే విషయాన్ని ఓరెగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు తమ సర్వేలో ప్రస్తావించారు. ఈమెయిల్‌, సోషల్‌ నెట్‌వర్కులు, మెసెంజర్లు ఎన్ని ఉన్నా.. వీటన్నింటిలో స్కైప్‌ వంటి సాధనాల ద్వారా జరుపుతున్న వీడియో చాటింగ్‌లు వృద్ధుల్లో మానసిక విచారాన్ని దూరం చేస్తున్నట్లు సర్వేలో గుర్తించామని తెలిపారు.