మగపిల్లలకు జ్ఞాపకశక్తి అందుకే తగ్గుతోందట!

12-06-2019: అమ్మాయిలతో పోలిస్తే, అబ్బాయిల్లో వాయుకాలుష్యం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందంటున్నారు బార్సిలోనా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ హెల్త్‌కి చెందిన పరిశోధకులు. గర్భంలో ఉన్న పిల్లలు, బాల్యదశ ఇంకా దాటని పిల్లలు, అంటే ఏడేళ్ళ వయస్సు వరకూ ఉన్న పిల్లలపై ఈ అధ్యయనం నిర్వహించారు. వారి అధ్యయనంలో కలుషిత గాలిని పీల్చిన మగపిల్లల్లో మాత్రమే జ్ఞాపకశక్తి, ఆలోచనా నైపుణ్యాలు తగ్గుతున్నట్టు వీరు గుర్తించారు. అయితే అమ్మాయిల్లో మాత్రం ఈ సమస్య కనబడలేదట. హార్మోన్లలోని తేడాలవల్లే అమ్మాయిలకు ఈ సమస్య ఉత్పన్నం కావడంలేదని వారు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి పిల్లలు వాయుకాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.