నికోటిన్‌ ప్యాచె్‌సతో జ్ఞాపక శక్తి వృద్ధి

17-03-2019: నికోటిన్‌ ప్యాచెస్‌.. ధూమపానం చేయాలనే కోరికను తగ్గించడమే కాకుండా జ్ఞాపక శక్తిని కూడా వృద్ధి చేస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. జ్ఞాపకశక్తి బలహీనతతో ఇబ్బంది పడుతున్న వృద్ధులు చాలా మందికి అల్జీమర్స్‌ లక్షణాలూ వృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి వారు నికోటిన్‌ ప్యాచెస్‌ వాడటం ద్వారా ఆయా లక్షణాలను తగ్గించుకునే అవకాశం ఉందని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల అధ్యయనం వివరించింది. సుమారు 76 ఏళ్ల వయసున్న, పొగతాగే అలవాటు లేని 74 మంది వ్యక్తులపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ప్యాచెస్‌ వినియోగించిన ఆరు మాసాల్లోనే ఫలితం కనిపించిందని, జ్ఞాపకశక్తి సమస్యలతో ఇబ్బంది పడుతున్న 46 మందిలో మెరుగైన ఫలితాలు కనిపించాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన పాల్‌ న్యూహౌస్‌ వెల్లడించారు.