శ్రవణ భ్రాంతికి అయస్కాంత చికిత్స

06-09-2017: కొందరికి వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటా యి. విషయం పక్కనున్న వాళ్లకు చెబితే పిచ్చోడు అంటారు. అలా శబ్దాలు వినబడటానికి కారణమ య్యే మెదడులోని భాగాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. శ్రవణ భ్రాంతి అనేది దీర్ఘకాలిక మనో వైకల్యం అని, దానికి అధిక పౌనఃపున్యం కలిగిన అయస్కాంత తరంగాలతో చికిత్స అందించవచ్చంటున్నారు ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ కాన్‌ శాస్త్రవేత్తలు. 26 మంది శ్రవణ భ్రాంతి రోగులకు రోజుకు రెండు విడతలుగా రెండు రోజుల పాటు 20హెర్ట్జ్‌ అయస్కాంత చికిత్స అందించగా వ్యాధి నయమైందని వెల్లడించారు.