ఎక్కువ‌గా న‌వ్వుతున్నారా?

06-12-2017: మీరు ఎక్కువ‌గా న‌వ్వుతున్నారా? అయితే మీరు ఎంతో కొంత వ్యాయామం చేసిన‌ట్టే. కొద్ది సేపు వ్యాయామం చేసిన త‌ర్వాత శ‌రీరం ఎలా స్పందిస్తుందో.. న‌వ్విన త‌ర్వాత కూడా అలాగే స్పందిస్తుంద‌ట‌. వ్యాయామం చేసిన త‌ర్వాత శ‌రీరంలోని లెఫ్టిన్ స్థాయులు ప‌డిపోయి, డోపమైన్ అధిక స్థాయిలో ఉత్ప‌త్తి అవుతుంది. హాస్యం క‌లిగించే సినిమాలు చూసినా.. లేదా ఎక్కువ సేపు న‌వ్వినా కూడా శ‌రీరంలో లెఫ్టిన్ స్థాయులు ప‌డిపోతున్న‌ట్టు లోమా లిండా యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు గుర్తించారు. అంటే న‌వ్వు కూడా శ‌రీరానికి ఓ వ్యాయామం లాంటిదేన‌న్న‌మాట‌. అంతేకాకుండా మ‌న‌స్ఫూర్తిగా బిగ్గ‌ర‌గా నవ్వ‌డం వ‌ల్ల జీవ‌క్రియ‌లు 20 శాతం మేర‌కు పుంజుకుంటున్న‌ట్టు కూడా గుర్తించారు. కాబ‌ట్టి వీలు కుదిరిన‌ప్పుడ‌ల్లా న‌వ్వండి!