ఆడవారే గ్రేట్‌

06-02-2019: పనిచేసే విషయంలో పురుషులతో పోల్చుకుంటే స్త్రీలే అన్ని విషయాల్లోనూ ముందుంటారన్న విషయం మరోసారి రుజువైంది. ఏదైనా ఒక పనిని స్త్రీ పురుషులలో ఎవరు ముందు చేస్తారన్న విషయం మీద రష్యా పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఒకే సమయంలో స్త్రీలు పలురకాల పనులను సమర్ధవంతంగా నిర్వహించగా, మగవారిలో దానిని వారు గుర్తించలేదు. 140 మంది స్త్రీ పురుషులకు ఒకే సమయంలో వివిధ రకాల పనులను అప్పగించారు. వీరు ఆ పనులను చేస్తున్న సమయంలో వీరి మెదడు పనితీరును గమనించారు. ఒకేసారి వివిధ రకాల పనులు చేస్తున్నప్పటికీ స్త్రీల మెదడు పురుషుల మెదడు కన్నా చురుకుగా పనిచేయడాన్ని గుర్తించారు. అంతే కాకుండా ఒకేసమయంలో పలు పనులుచేసే సమయంలో స్త్రీ మెదడు తక్కువ శక్తిని వినియోగించుకోవడాన్ని వీరు గమనించారు. అయితే ఆడవారిలో ఈ ప్రత్యేకతకు కారణాన్ని వారు గుర్తించలేకపోయారు.