తెల్ల గలిజేరుతో కిడ్నీకి ఆరోగ్యం

14-03-2019: మూత్రపిండాల సమస్యతో బాధపడేవారికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్స డయాలసిస్‌ ఒకటే. ఈ వ్యాధికి అలోపతి వైద్యంలో పరిమితమైన చికిత్సలు ఉన్నాయి. అయితే, ఆయుర్వేదంలో కిడ్నీ వ్యాధికి ఉపయుక్తమైన చికిత్స ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెల్ల గలిజేరు(పునర్నవ) మొక్క నుంచి తీసిన రసాన్ని మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారికి నెలపాటు తాగిస్తే వ్యాధి తగ్గుముఖం పడుతుందని వారణాసిలోని బనారస్‌ హిందూ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. రక్తంలో ఉండే క్రియాటినిన్‌, యూరియా స్థాయులు అదుపులో ఉంటాయని వెల్లడించారు.