జంక్‌ఫుడ్‌, ఒత్తిడి ఒక్కటే!

18-10-2017: జంక్‌ఫుడ్‌ తింటే మన శరీరానికి ఎంత హనికరమో.. ఒత్తిడితో కూడా అంతే నష్టమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి వల్ల మానసిక అనారోగ్యం వస్తుందని మనం భావిస్తున్నాం. కానీ, దాంతో శారీరకంగా అంటే.. కడుపులోని బ్యాక్టీరియాపై చెడుప్రభావం పడుతుందట. ఆడ ఎలుకను ఒత్తిడికి గురిచేసి దాని జీర్ణవ్యవస్థను పరిశీలించినపుడు ఈ విషయం వెల్లడైందని అమెరికాలోని బ్రిఘం యంగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.