హైబీపీకి అవే కారణమా?

12-06-2019: కాస్తంత కోపంగా మాట్లాడినా, అరచినా బీపీ పెరిగిందా ఏమిటీ? అంటుంటారు. ఈమధ్య హైబీపీ సమస్యతో ఇబ్బందిపడుతున్నవారు పెరుగుతున్నారనే చెప్పాలి. దానికి నిద్రలేమి, పనిఒత్తిడే కారణమంటున్నారు జర్మనీలోని మ్యూనిచ్‌ టెక్నికల్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. ఈ రెండు కారణాలు మనిషిని మానసికంగా అస్తవ్యస్తం చేయడంతోపాటు, హార్మోన్‌ లెవెల్స్‌లో తేడాలకు కారణమవుతున్నాయట. దాంతో ఎక్కువగా హైబీపీ సమస్య వస్తున్నట్టు వారు చెబుతున్నారు. 25 నుంచి 65 ఏళ్ళ మధ్య వయసున్నవారిని రెండువేలమంది హైబీపీ రోగులను పరిశీలించి మరీ శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికి వచ్చారు. అంతేకాదు, హైబీపీతో బాధపడుతున్నవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని కూడా వీరి అధ్యయనంలో తేలింది.