దంత శుభ్రతకు, మతిమరుపుకు సంబంధం ఉందా?

12-06-2019: దంత శుభ్రతకు, మతిమరుపుకు సంబంధం ఉందా అంటే.. ఉందనే అంటున్నారు అధ్యయనకారులు. చిగుళ్ళ జబ్బుతో బాధపడేవారిలో కనిపించే పి.జింజివలిస్‌ అనే బాక్టీరియా అల్జీమర్స్‌ బాధితుల మెదళ్ళలోనూ ఉంటున్నట్టు ఈ మధ్యనే జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. నోటిలో ఈ బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వల్ల మెదడులో అమీలాయిడ్‌ బీటా అనే ప్రోటీన్ పోగుపడుతుందని, దానివల్ల అల్జీమర్స్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనకారులు చెబుతున్నారు. కాబట్టి దంతాలు, చిగుళ్ళు శుభ్రంగా ఉండేలా చూసుకుంటే, భవిష్యత్తులో అల్జీమర్స్‌ ముప్పును తగ్గించుకోవచ్చని వారి సూచన.