అతినిద్రతో తెలివితేటలపై ప్రభావం

11-10-2018: ‘..అతినిద్ర లోలుడు తెలివిలేని మూర్ఖుడు’ అని ఒక సినిమా పాటలో రచయి త అన్న మాట అక్షరసత్యమని అంటున్నారు కెనడాకి చెందిన వెస్టర్న్‌ యూనివర్సిటీ పరిశోధకులు. కంటినిండా కునుకు లేకపోతే ఆరోగ్యానికి ఎంత ప్రమాద మో అతినిద్రతోనూ అంతే ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. రోజుకు 7 నుంచి 8 గంటల కంటే ఎక్కువసేపు పడుకుంటే దాని ప్రభావం మెదడు పనితీరుపై పడుతుందని, తెలివితేటలు తగ్గిపోతాయని అంటున్నారు. గత ఏడాది జూన్‌ నుంచి 40 వేల మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు.