ఇక లాసిక్‌ కంటి చికిత్స మెరుగు!

14-03-2019: లాసిక్‌ సర్జరీ.. హ్రస్వ, దీర్ఘ దృష్టి వంటి లోపాలను లేజర్‌ చికిత్స ద్వారా సరిచేసే ప్రక్రియ. దాదాపు 20 నిమిషాల్లో పూర్తి చేసే ఈ సర్జరీ.. రోగులు కళ్లజోళ్లు, కాంటాక్ట్‌ లెన్స్‌లు అవసరం లేకుండా చేస్తాయి. అయితే లాసిక్‌ సర్జరీని మరింత మెరుగుపరిచి, సాధారణ సర్జరీలు అవసరం లేకుండా చేసే సరికొత్త మైక్రోస్కోపీ పరిజ్ఞానాన్ని అమెరికాలోని మేరీలాండ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ గియులియానో స్కార్సెలీ అభివృద్ధి చేశారు. కంటిలోని కార్నియాపై ఒక వస్తువు కాంతి వక్రీభవనం చెందడాన్ని రమారమి అంచనా వేసి ఇప్పటివరకు చికిత్స అందించారు.