రాత్రి భోజనం వేళలు మారితే కేన్సర్‌!

19-07-2018: రాత్రి 9 గంటలకంటే ముందుగా లేదా పడుకోవడానికి రెండుగంటల ముందు భోజనం చేసే వారికి బ్రెస్ట్‌, ప్రొస్టేట్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తాజా అధ్యయనం చెబుతోంది. ఆహారం విషయంలో సమయపాలన అతిముఖ్యమని ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ కేన్సర్‌లో ప్రచురించిన సర్వేలో తెలిపారు. బ్రెస్ట్‌, ప్రొస్టేట్‌ కేన్సర్లు ఎక్కువగా రాత్రి షిఫ్ట్‌లలో పనిచేసేవారికి వస్తున్నట్లు గుర్తించామని.. దీనికి కారణం వారి లైఫ్‌ స్టయిల్‌ మారిపోవడమేనని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌(స్పెయిన్‌) పరిశోధకులు వివరించారు. ఇందుకోసం 621 ప్రొస్టేట్‌ కేన్సర్‌, 1205 బ్రెస్ట్‌ కేన్సర్‌ రోగుల జీవన విధానాన్ని పరిశీలించారు.