ఒకే రక్త పరీక్షతో 20 రకాల కేన్సర్లు గుర్తింపు

29-09-2019: ఒకే రక్తపరీక్షతో 20రకాల కేన్సర్లను గుర్తించగల విధానాన్ని అభివృద్ధిపరిచామని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. శరీరంలో ఏ భాగంలోని ఏ కణజాలానికి కేన్సర్‌ వచ్చిందో కచ్చితంగా గుర్తించగలగడం దీని ప్రత్యేకత అని కేన్సర్‌ పరిశోధనా సంస్థ ‘గ్రెయిల్‌’ ప్రకటించింది. స్పెయిన్‌లో జరిగిన యూరోపియన్‌ సొసైటీ ఫర్‌ మెడికల్‌ అంకాలజీ సదస్సులో తమ ప్రయోగ ఫలితాలను వెల్లడించింది.