నరాల చికిత్సకు కన్నీళ్ల సాయం

24-02-2018: దుఃఖం, సంతోషం వంటి బలమైన భావోద్వేగాలు కలిగినపుడు వచ్చేవే కన్నీళ్లు. అశ్రువులు రాల్చితే ఆరోగ్యంగా ఉంటామని, ప్రశాంతత చేకూరుతుందని చాలా పరిశోధనల్లో తేలింది. తాజాగా, నరాల బలహీనతకు చికిత్స అందించడంలోనూ కన్నీళ్లు సాయం చేస్తాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తెలిపారు. కన్నీటి గ్రంథిలోని నరాలు ఉత్తేజితమైనపుడు రహస్య కణాలు కొన్ని ప్రొటీన్లను విడుదల చేస్తాయని, ఆ ప్రొటీన్లు కన్నీళ్లలో ఉంటాయని, ఆ ప్రొటీన్ల పరిస్థితిని బట్టి నరాల బలహీనత ప్రభావాన్ని గుర్తించవచ్చని వివరించారు. ఆ ప్రభావానికి తగ్గట్లు రోగికి చికిత్స అందించవచ్చని వెల్లడించారు.