వెయిట్‌లిఫ్టింగ్‌తో గుండెకు మేలు!

వాషింగ్టన్‌, నవంబరు 18: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే గంటల తరబడి జిమ్‌లో గడపాల్సిన అవసరం లేదని అమెరికాలోని అయోవా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. వారంలో ఒక గంటపాటు వెయిట్‌లిఫ్టింగ్‌ చేసినా చాలు గండె జబ్బు, గుండెపోటు వచ్చే ప్రమాదం 40 నుంచి 70 శాతం తగ్గుతుందని చెబుతున్నారు. 3 వేల మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించారు.