గుప్పెడు బెర్రీలతో గుండె పదిలం!

15-08-2018: పళ్ళు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చన్న సంగతి తెలిసిందే! అయితే గుప్పెడు బెర్రీ పండ్లను ప్రతిరోజూ తీసుకోవడంతో గుండెజబ్బులను దూరం చేసుకోవచ్చనీ, తద్వారా అకాల మృత్యువును తప్పించుకోవచ్చు అంటున్నారు ఈస్ట్‌ ఎంజిలియా యూనివర్సిటీ పరిశోధకులు. ఈ పండ్లలో లభించే ఆంథోసైనిన్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడి సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుందన్న విషయం వీరి పరిశోధనలో స్పష్టమైంది. ఒక్క బెర్రీ పండు అని కాకుండా ఏ పండు తీసుకున్నా, వాటిల్లో యాంటిఆక్సిడెంట్లు గుండెతో పాటు శరీరారోగ్యాన్ని రక్షిస్తాయనీ, బెర్రీ పండు తీసుకోవడం వలన మరింత ప్రయోజనాన్ని పొందవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు.