చేపలు తింటే గుండెకు మేలు!

18-05-2018: మీరు చేపలు బాగా తింటారా? అయితే మీ గుండె పదిలం అంటున్నారు వైద్య పరిశోధకులు. వారానికి రెండుసార్లు చేపలు ఆరగిస్తేచాలు గుండె ఆరోగ్యంగా ఉంటుందని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ చెబుతోంది. గుండెపోటు, హృదయ సంబంధ రుగ్మతలు వచ్చే అవకాశాలు చాలా తక్కువుగా ఉంటాయని వెల్లడించింది. సీ ఫుడ్‌లో ఉండే ఒమే గా-3 కొవ్వు ఆమ్లాలు ఎంతో మేలు చేస్తాయని హార్వర్డ్‌ టీహెచ్‌ చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రొఫెసరు ఎరిక్‌ బి రిమ్‌ తెలిపారు.